విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్‌పై కలెక్టర్ వినయ్ చంద్, కేజీహెచ్ అధికారులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా సీఎస్ఆర్ నిధులతో కేజీహెచ్ లో జరుగుతున్న పనులపై చర్చించారు. సీఎస్ఆర్ బ్లాక్ నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలని, ఇందులో భాగస్వాములైన మిగిలిన ప్రభుత్వ సంస్థలకు నిధులు కోసం లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు. కేజీహెచ్‌కి పరికరాల కొనుగోలుకు సుమారు 46 లక్షలు ప్రతిపాదన చేయగా.. కలెక్టర్ వెంటనే అంగీకారం తెలిపారు.
ఇదీ చూడండి:ముందు చూపు లేకపోతే.. ఇలాంటి సమస్యలు తీరవు