Co vaxin drops: విశాఖ వైద్యవిజ్ఞాన సంస్థ(విమ్స్)లో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ముక్కు ద్వారా అందించే చుక్కల మందు మూడోదశ పరిశోధన(ట్రయల్స్) కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కొణతం రాంబాబు ఆధ్వర్యంలో వైద్యుల బృందం తొలిరోజు నలుగురు వాలంటీర్లకు దీనిని అందించారు.
చుక్కల మందు రూపంలో ముక్కు ద్వారా అందిస్తున్న ఈ వ్యాక్సిన్ ద్వారా మరింత సమర్థవంతంగా యాంటీబాడీలు అభివృద్ధి అవుతున్నట్లు పరిశోధనలో తేలిందని.. విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో విమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఈ ట్రయల్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 39 మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. తొలిరోజు నలుగురికి ఇచ్చి పరిశీలనలో ఉంచామన్నారు.
ఇదీ చదవండి: