విశాఖ పాడేరు మన్యం ఘాట్రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ సమీపంలో భారీ కొండచరియ రోడ్డుకు అడ్డంగా విరిగి పడింది.
భారీ వర్షానికి బండరాళ్లతో పాటు కొండమట్టి, బురద రోడ్డుకు అడ్డంగా మేట వేసింది. దీంతో పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు దొర్లి రావటంతో.. మధ్యలో ఉన్న కాఫీ తోటలు సైతం ధ్వంసం అయ్యాయి.
ఇదీ చదవండి: పాలవెల్లి సమీపంలో పెరిగిన తుప్పలు.. పట్టించుకోని అధికారులు