విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో శుద్ధి చేపట్టారు. ఆలయ ఈఓ సూర్యకళ ఆదేశాల మేరకు.. ఆలయం లోపల, బయటున్న ఇత్తడి రాగి గ్రిల్స్ ను శుభ్రపరిచారు. ఆలయ అధికారులు దగ్గరుండి.. కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మండపంలోని అన్ని గ్రిల్స్ ను పాలిష్ చేశారు.
ఇత్తడి గ్రిల్స్ బంగారంలా తళతళ మెరుస్తుండటంతో భక్తులు సరికొత్త అనుభూతి పొందుతున్నారు. జూన్ 1 నుంచి ఆలయంలో దర్శనం వేళలు రెండు గంటలు పొడిగించారు. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో సూర్య కళ తెలిపారు.
ఇదీ చదవండి:
Cm Jagan: 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన