విశాఖ మల్కాపురం 63వ వార్డులో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో తెదేపాకు చెందిన వారు రాకూడదంటూ వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ కారణంగా.. స్థానిక 63వ వార్డు తెదేపా కార్పోరేటర్ గల్లా చిన్నను అధికారులు ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రవేశం లేదంటూ వైకాపా శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అధికారులు సర్ది చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: