లాక్ డౌన్ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా వలయాలు గీయిస్తున్నారు. ప్రధాన బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్, విచారణ కేంద్రాలు, దుకాణాలు, ఆహార శాలల వద్ద సర్కిల్స్ గీయించారు. విశాఖతో పాటు విజయనగరంలో రైల్వేస్టేషన్లోనూ ఈ విధమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. మారిటైమ్ బోర్డు ఛైర్మన్గా శ్రీధర్ రెడ్డి