ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్గా గాడి శ్రీధర్ రెడ్డి నియమిస్తూ.. మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి గానూ ప్రత్యేక వాహక సంస్థలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటి నిర్మాణ బాధ్యతల్ని ఏపీ మారిటైమ్ బోర్డుకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈమేరకు ఆ సంస్థకు ఛైర్మన్గా జి.శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: తిరుమలలో చిరుత సంచారం.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు