సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నలంద కిశోర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీబీఎం కాంపౌండ్‌లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆరోగ్యం సరిగా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా.. పోలీసులు వినలేదని కిషోర్ బంధువులు తెలిపారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిషోర్ అనుచరుడు కావడంతో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడకు కిశోర్: న్యాయవాది సుమన్
నలంద కిశోర్‌ను విజయవాడకు తరలిస్తున్నట్లు...ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సుమన్ తెలిపారు. కిశోర్‌పై ఐపీసీ 505(బి), 120(బి) కింద కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు?