విశాఖ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శ్రీను(51) మృతి చెందారు. తల్లిదండ్రులను చూసేందుకు ఆయన బుచ్చెయ్యపేట మండలం ఎల్బీపీ అగ్రహారం వెళ్లారు. అక్కడ కొలువైన వడ్డాదికొండ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయారు. అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: 'రహదారులకు మరమ్మతులు చేయండి'