ETV Bharat / state

క్రిస్మస్‌ సందడితో.. విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోతున్న ప్రార్థనా మందిరాలు - సందడిగా క్రిస్మస్‌

Christmas Celebrations: రాష్ట్రంలో క్రిస్మస్‌ సందడి నెలకొంది. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అర్థరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విద్యుత్‌ కాంతుల్లో ప్రార్థనా మందిరాలు వెలుగులీనుతున్నాయి. బాలఏసు గీతాలను ఆలపిస్తూ, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు చాక్లెట్లు, బహుమతులను శాంతాక్లాజ్ పంచుతున్నారు.

Christmas celebrations
క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 25, 2022, 11:17 AM IST

రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. విశాఖలో నోవాటెల్ హోటల్‌ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ప్రత్యేక రథంలో వచ్చిన శాంతాక్లాజ్ పిల్లలకు చాక్లెట్లు, టోఫీలను పంచారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్సీఎం సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విద్యుత్ దీపాలంకరణతో ప్రార్థనా మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.

కేంద్ర పాలిత యానంలో పురాతన రోమన్ క్యాథలిక్ చర్చిలో ఏసు క్రీస్తు జీవిత ఘట్టాలను గోడలపై అందంగా తీర్చిదిద్దారు. కరుణామయుడు జన్మించిన పశువులపాక.. క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనకాపల్లిలో క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రార్థనా మందిరాల్లో బాలఏసు పాటలను ఆలపించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో సీఎస్ఐ చర్చ్‌ను బెలూన్లతో అందంగా అలంకరించారు. ఒంగోలు జేఎంజీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలులో విద్యుత్ దీప కాంతుల్లో చర్చిలు మెరిసిపోతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.