వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో వైకాపా కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు పులిహోర, చక్కెర పొంగళి పంచిపెట్టారు.
ఇది కూడా చదవండి.