ETV Bharat / state

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

విశాఖ జిల్లా చోడవరంలో ఆదివారం జరిగిన యువకుని హత్య కేసులో ప్రధాన నిందితుడు... సత్తిబాబుకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్
author img

By

Published : Jul 16, 2019, 2:39 AM IST

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

విశాఖ జిల్లా చోడవరంలో రాజేష్ అనే యువకుడిని హత్య చేసిన పండూరి సత్తిబాబును పోలీసులు రిమాండ్​కు తరిలించారు. ఆదివారం జరిగిన హత్యకు సంబంధించి సత్తిబాబు అదుపులోకి తీసుకున్న పోలీసులు... సోమవారం సాయంత్రం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం చోడవరం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. నడిరోడ్డుపై.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య.. సంచలనం సృష్టించింది.

ఇదీ చదవండి : చోడవరంలో.. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Intro:Ap_cdp_46_15_esuka kastalu_kafmikula_andolana_Av_Ap10043
రాష్ట్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి తెలిపారు. ఇసుక కష్టాలు తీర్చాలంటూ కడప జిల్లా రాజంపేట లోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బయట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు వింత ఆలోచనతో ఇసుక కష్టాలు వచ్చాయని ఈ సమస్యలను అధిగమిస్తూ ఇసుకను ఉచితం చేశారని తెలిపారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తెదేపా ఇసుక పాలసీని రద్దు చేస్తూ కొత్త నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమలు చేస్తాం అనడం దారుణమన్నారు. నిబంధనలు ఎప్పటి నుంచి అమలు చేసినా అంతవరకు ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇసుక లేని కారణంగా రాష్ట్రంలో లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కార్మిక సత్తా ఏందో చూపిస్తారని హెచ్చరించారు ఆన్లైన్ లో డబ్బులు కడితే ఇంటికి ఇసుక వస్తుందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా చేస్తే వారానికి కూడా ఓ ట్రాక్టర్ ఇసుక రాని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలయ్యే వరకు భవన నిర్మాణాలకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరా సులభతరం చేయాలని కోరారు. ఒకపక్క భవన నిర్మాణాలకు ఇసుక అందక కార్మికులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు రాజకీయ నాయకులు అక్రమంగా టిప్పర్లతో రాష్ట్రాలను దాటిస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఆర్టీవో నాగన్నకు వినతి పత్రాన్ని అందజేశారు.

Body:ఇసుక కష్టాలపై భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

Conclusion:ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ మునిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.