సింహగిరిపై కొలువైన శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారిని... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరీ దర్శించుకున్నారు. చీఫ్ జస్టిస్‌కు కొండపై ఘనస్వాగతం లభించింది. ఆలయ ఈవో... పూర్ణకలశంతో ఎదురెళ్లి నాదస్వరం మేళ తాళాలతో ఆహ్వానించారు. వేదపండితులు చీఫ్ జస్టిస్‌కు అశీర్వచనం పలుకగా... అంతరాలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. పూజ అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు... జస్టిస్ మహేశ్వరీకు స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇవీ చూడండి-రెండు విడతల్లో 'జగనన్న వసతి దీవెన' సాయం