నేడు, రేపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటించనున్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వివిధ ప్రాంతాల్లో రోడ్షాలు నిర్వహించనున్నారు. మొదట శనివారం ఒక్కరోజే పర్యటన ఖరారు చేసినప్పటికీ జీవీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు ఉండేలా ప్రణాళికలో మార్పు చేసినట్లు తెలుస్తోంది.
- శుక్రవారం మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- సాయంత్రం నాలుగు గంటలకు రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు.
- సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెందుర్తి కూడలికి చేరుకుంటారు. అక్కడి నుంచి గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు వరకు మొదటి రోజు ప్రచారం కొనసాగనుంది.
- శనివారం ఉదయం గాజువాక నుంచి ప్రచారం ప్రారంభంకానుంది.
- పాతగాజువాక నుంచి శ్రీహరిపురం, దుర్గాలమ్మగుడి 80 అడుగుల రోడ్డు వరకు మొదటి రోజు ప్రచారం కొనసాగనుంది.
- శనివారం ఉదయం గాజువాక నుంచి ప్రచారం ప్రారంభంకానుంది. పాతగాజువాక నుంచి శ్రీవారిపురం, దుర్గాలమ్మగుడి వరకు ప్రచారం సాగనుంది. తరువాత రెండు గంటల పాటు పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రామ్‌నాగర్ పార్టీ కార్యాలయంలో సమీక్షిస్తారు. తరువాత జగదాంబ కూడలి, సీతంపేట, ఇసుకతోట, హనమంతువాక మీదుగా పీఎంపాలెం వరకూ ప్రచారం కొనసాగించనున్నారు.
ఇదీ చదవండి: నిరసనలు కొనసాగుతున్నా.. అమ్మకానికి అడుగులు !