విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం కింతాడ శివారు కూండ్రపువానిపాలెం గ్రామానికి చెందిన కుబిరెడ్డి రాధాకృష్ణ, వరలక్మి దంపతులు. ఇద్దరికీ మూగజీవాలంటే ఎంతో మమకారం. రాధాకృష్ణ ఓ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఓ రోజు ఇంటి పక్కన ఉన్న చెట్లపైకి కొన్ని పక్షులు వచ్చాయి. అవి ఎండకు అల్లాడిపోతున్నాయి. అది చూసిన ఆ దంపతులిద్దరికీ ఓ ఆలోచన వచ్చింది. తొట్టెలో నీళ్లుపోసి పెట్టారు. మరుసటిరోజు మరికొన్ని పక్షులు, మూగజీవాలు వచ్చాయి. ఇలా.. ప్రతిరోజూ అలవాటుగా మారడంతో వందలాది మూగజీవాలు రావడం మొదలుపెట్టాయి. ఇలా.. ఆరేళ్లుగా మూగజీవాలకు ఎంతో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వందలాది పక్షులు, మూగజీవాలు చలివేంద్రంలో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఇక్కడకు వివిధ రకాల పక్షులు వస్తుంటాయి. ఆ ఇంటి ప్రాంతం మూగజీవాలు, పక్షులకు నిలయంగా మారింది.
ప్రతి ఒక్కరూ మూగజీవాల దాహార్తి తీర్చాలి..
ఆరేళ్లుగా మూగజీవాల కోసం ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేశాం. పక్షులు, శునకాలు ఇతర మూగజీవాలు దాహార్తిని తీర్చుకొనేందుకు, నీరు చల్లగా ఉండేందుకు ప్రత్యేకంగా మట్టి పాత్రలు ఉంచాం. వేసవి వచ్చిందంటే నీరు దొరక్క.. నోరున్నా అడగని మూగజీవాలు కోసం చలివేంద్రం కొనసాగిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ తరహా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మూగజీవులకు బాసటగా నిలవాలని కుబిరెడ్డి రాధాకృష్ణ-వరలక్మి దంపతులు అంటున్నారు.
ఇదీ చూడండి:
రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్
రాష్ట్రంలో మళ్లీ 3 వేలు దాటిన కరోనా కేసులు.. 12 మంది మృతి