ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు విశాఖ వాసులను అకట్టుకున్నాయి. హనుమ- సమాజసేవ అనే అంశంపై రామాయణాంతర్గతంగా నేటి తరానికి ఎంతో విలువలను అందించిన హనుమ అందరికి అదర్శప్రాయుడని చాగంటి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల చాగంటి సత్సంగం అధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మహిళలు యువత హాజరయ్యారు. చాగంటి వారికి వేద సంప్రదాయబద్దంగా పూర్ణకుంభ స్వాగతం, మహిళలు కోలాట ప్రదర్శనలతో స్వాగత పలికారు. ఈ సందర్భంగా బాలల గురుస్తుతి గానం, మహిళల విష్టుసహస్రనామపారాయణలు చేశారు.
ఇదీ చూడండి మా పొట్ట కొట్టకండి... అన్నా క్యాంటీన్లను కొనసాగించండి!