ETV Bharat / state

CWC Visit Sileru Complex: సీలేరు జలాశయాలను పరిశీలించిన.. కేంద్ర నీటి కమిషన్ - కేంద్ర నీటి కమిషన్ తాజా వార్తలు

Central Water Commission Visit Sileru Complex: సీలేరు కాంప్లెక్స్​లోని జలాశయాలను కేంద్ర నీటి కమిషన్, గోదావరి నది నిర్వహణ బోర్డు సభ్యుల బృందం ఇవాళ పరిశీలించింది. జలాశయాల్లో నీటి నిల్వలు, ఇన్​ఫ్లో, అవుట్ ఫ్లో గురించి వివరాలను సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

సీలేరు జలాశయాలను పరిశీలించిన కేంద్ర నీటి కమిషన్

author img

By

Published : Dec 19, 2021, 8:53 PM IST

Central Water Commission Visit Sileru Complex: కేంద్ర నీటి కమిషన్, గోదావరి నది నిర్వహణ బోర్డు సభ్యుల బృందం సీలేరు కాంప్లెక్స్​లోని జలాశయాలను ఇవాళ పరిశీలించింది. ఏపీ జెన్​కో అధికారులతో కలిసి కాంప్లెక్స్​లోని డొంకరాయి, సీలేరు, బలిమెల జలాశయాలను పరిశీలించింది. జలాశయాల్లో నీటి నిల్వలు, ఇన్​ఫ్లో, అవుట్ ఫ్లో గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏటా గోదావరి డెల్టాకు సీలేరు నుంచి విడుదల చేస్తున్న నీటికి సంబంధించిన లెక్కల వివరాలపై జెన్​కో అధికారులు ఆరా తీశారు. బలిమెల నుంచి ప్రతి ఏటా విద్యుదుత్పత్తికి వాడుతున్న నీరు, గోదావరికి విడుదల చేస్తున్న నీటి వివరాలను తెలుసుకున్నారు. జలాశయాల నిర్వహణ పట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.

సీడబ్య్లూసీ ముఖ్య ఇంజనీరు వి.రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సీలేరు కాంప్లెక్స్​లో పర్యటించామన్నారు. జీఆర్​ఎంబీ ఏర్పాటయిన తర్వాత ప్రాజెక్టుల ఆస్తులు, అప్పులు, పనితీరు, స్థితిగతులు పరిశీలిస్తున్నారని దీనిపై ఒక నివేదికను ఆయా బోర్డులు వారి యాజమాన్యాలకు అందజేస్తారని తెలిపారు. నివేదిక ప్రకారం..ఈ ప్రాజెక్టులు గోదావరి నది నిర్వహణ బోర్డు పరిధిలోకి వస్తాయా? రావా? అని పరిశీలిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు (విద్యుత్తు) వెంకట సుబ్బయ్య, డీఈఈ ఎం . విజయలక్ష్మి, ఏఈఈ ఎన్.స్వాతి, కేంద్ర నీటి కమిషన్​కు చెందిన ముఖ్య ఇంజినీరు ఎ.కె.నాయక్, ఎస్ఈ ఎం.రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

Pattabhi On ORR: 'అలా కేంద్రానికి లేఖ రాసి.. ఓఆర్ఆర్​కు ఉరి వేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.