పిల్లలకు ఓటు హక్కు లేనప్పటికీ సమాజంలో వారు కూడా భాగమే అని బాలవికాస్ ఫౌండేషన్ అధ్యక్షుడు నరవ ప్రకాశ్ తెలిపారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. పిల్లల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అధ్యాపకుల కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి.. పిల్లల రక్షణ ప్రణాళిక అమలు చేయాలని కోరుతూ ఒక నివేదిక అందజేయనున్నట్లు బాలవికాస్ ఫౌండేషన్ తెలిపింది.
ఇదీ చూడండి: