ETV Bharat / state

గోరాపూర్ వద్ద 580 కిలోల గంజాయి పట్టివేత - విశాఖలో గంజాయి పట్టివేత వార్తలు

విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని గోరాపూర్ వద్ద గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సీఐ రాజారావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

గోరాపూర్ వద్ద 580 కిలోల గంజాయి పట్టివేత
గోరాపూర్ వద్ద 580 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Apr 18, 2021, 7:21 PM IST

గోరాపూర్ వద్ద ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయిని తరలిస్తున్న వ్యాన్ పట్టుబడింది. ఒడిశా నుంచి విశాఖకి వెళ్తున్నా వ్యాన్ ఆపకుండా ముందుకు వెళ్లింది. వ్యాన్​ను వెంబడించి వెళ్లగా కొంత దూరంలో వాహనాన్ని ఆపేసి.. డ్రైవర్ పరారయ్యాడు. వెనక భాగంలో తనిఖీ చేయగా రహస్య అరలో 116 గంజాయి ప్యాకెట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్​లో ఐదు కిలోల చొప్పున గంజాయి ఉందన్నారు. మొత్తం 580 కిలోల గంజాయి లభించినట్లు అధికారులు చెప్పారు. వాహనం గుజరాత్​కు చెందినదని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ప్రస్తుత పరిస్థితి చేయిదాటిపోతే తట్టుకునే శక్తి దేశానికి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.