ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు సూచించారు. ఇటీవల గల్ఫ్ బాధితుల సంఖ్య పెరుగుతోందనీ.. ఏజెంట్ల మాయమాటలు నమ్మి నిరుద్యోగ యువత, మహిళలు మోసపోతున్నారని చెప్పారు. ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. వారు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అనేది ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. మోసపోయిన వ్యక్తులు స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చాక... ఏజెంట్లపై ఫిర్యాదు చేయొచ్చనీ.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇవీ చదవండి..