ETV Bharat / state

తమిళనాడు తీరంలో బలహీనపడిన బురేవి తుపాను - RAINS IN IN ANDHARA PRADESH

బురేవి తుపాన్ తమిళనాడులో తీరం దాటక ముందే బలహీన పడినట్లు వాతవరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర, లక్ష్యద్వీప్‌ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

తమిళనాడు తీరంలో బలహీనపడిన బురేవి తుపాను
తమిళనాడు తీరంలో బలహీనపడిన బురేవి తుపాను
author img

By

Published : Dec 5, 2020, 2:43 AM IST

‘బురేవి’ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా తమిళనాడు తీరం రామనాథపురం జిల్లాకు దగ్గరగా ఉంది. ఉదయంలోపు ఇది మరింత బలహీనపడి ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉండిపోనుంది. ఇదివరకు భారత వాతావరణవిభాగ శాస్త్రవేత్తలు చెప్పినదాన్నిబట్టి ఇది దక్షిణ తమిళనాడు, కేరళమీదుగా వెళ్లి అరేబియా సముద్రంలో కలుస్తుందని అంచనా వేశారు. కానీ దీనికి భిన్నంగా తమిళనాడు తీరం దాటకమునుపే క్రమంగా బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌ ఆధారంగా
తెలుస్తోంది.

దీని ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర, లక్ష్యద్వీప్‌ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు. నైరుతీ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడుతీరంతో పాటు శ్రీలంక, లక్ష్యద్వీప్, మాల్దీవులు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

బడిలో నిల్వ ఉంచిన గ్రానైట్ తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.