వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఇసుక కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. ఈ ఏడాది కరోనా కారణంగా నిర్మాణ రంగం కుదేలైందని.. కార్మికులు పనుల్లేక ఆదాయం కోల్పోయారన్నారు. అందుకే నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేల చొప్పున 6 నెలలపాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వం కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పథకాలకు ఖర్చు చేస్తోందని కృష్ణారావు ఆరోపించారు. సంక్షేమ బోర్డును మూసివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఈ క్రమంలో నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..