ETV Bharat / state

కలగా మారిన వంతెన.. గిరిజన గ్రామాల ప్రజల బతుకులింతేనా? - మాడుగుల

విశాఖ జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు. ఆ గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోతాయి. గెడ్డ పొంగి ప్రవహించటంతో రాకపోకలకు పూర్తిగా అడ్డుపడింది. ప్రజానీకం జలదిగ్భంధంలో చిక్కుకున్నారు.

కలగా మారిన వంతెన.. జల దిగ్బంధంలో గిరిజన గ్రామాలు
author img

By

Published : Oct 3, 2019, 12:12 PM IST

కలగా మారిన వంతెన.. జల దిగ్బంధంలో గిరిజన గ్రామాలు

విశాఖపట్నం జిల్లా మాడుగుల శంకరం కృష్ణంపాలెం మార్గంలో ఉరకగెడ్డ కొద్దిరోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట, రాయపాలెం, తాటివలస, గిరిజన గ్రామాల ప్రజలు.. ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు, పంటలు విక్రయించాలంటే గెడ్డ దాటి మాడుగుల వచ్చేందుకు.. నరకయాతన అనుభవిస్తున్నారు. పీకల్లోతులో వరద నీరు.. ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగించాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా.. కార్యరూపం దాల్చలేదని ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మించాలని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి:

అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు

Intro:...Body:కళాశాలలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఒక విద్యార్థిపై మరొక విద్యార్థి దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని పెద్ద తాడేపల్లి గ్రామంలో ఉన్నా ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కలకలం రేగింది. బాధిత విద్యార్థిపై దాడికి చేయడమే కాకుండా సినీ ఫక్కీలో తన స్నేహితులతో వీడియో తీయమని సదరు విద్యార్థి పైశాచికంగా వ్యవహరించాడు. కొడుతుండటం చూసి దాన్ని ఆపడం మాని ఆ సంఘటన వీడియో తీస్తూ దాడి చేసే విద్యార్థికి సహచర విద్యార్థులు సహకరించడం ఇంకా దారుణం. గత నెలలో జరిగిన ఈ వ్యవహారానికి చెందిన వీడియో ఇప్పుడు బయట పడటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. కళాశాల స్థాయిలోనే ఈ వ్యవహారం సద్దుమణిగింది. విద్యార్థులు ఈ వీడియోను ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకుంటున్న సందర్భంలో ఈ విషయం బయటకు పొక్కింది.Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.