విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన వివాహ వేడుకపై అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని కర్రీ వెంకట రమణబాబు కుమార్తె వివాహం అట్టహాసంగా నిర్వహించారు. తక్కువ మందితో వివాహం నిర్వహించడానికి అనుమతి తీసుకుని వందలాది మందితో వివాహ వేడుకతో పాటు, విందును ఏర్పాటుచేశారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సామాజిక దూరం పాటించకుండా వివాహ వేడుక నిర్వహించినందుకు వెంకటరమణ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి...