ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని గిరి గ్రామాల్లో స్వచ్ఛభారత్ జాతీయ సమైక్యత కోసం... సరిహద్దు భద్రతా బలగాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే నష్టాలు, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వినియోగం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలుపుతూ సంప్రదాయ నృత్యాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఏవోబీలోని ఒనకఢిల్లీలో 15వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కలహండి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకాల గురించి సైతం విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: డొంకరాయి పవర్ కెనాల్‌కు 'రక్షణగోడ' నిర్మాణం