కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ నిరసన చేపట్టింది. అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు సంఘ నేతలు వినతి పత్రం అందించారు.
కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం తగదని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకువాడ శ్రీరాములు అన్నారు. మార్చి, ఏప్రిల్ జీతాలను కార్మికులకు అందించాలని చెప్పారు. వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేయాలని కోరారు.