అర్హులైన జర్నలిస్టులకు పక్కా గృహాలు నిర్మించేందుకు కాటూరి వీరన్న ఛారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని... ఆ సంస్థ వ్యవస్థాపకులు, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటూరి రవీంద్ర అన్నారు. విశాఖలోని మధురవాడ శిల్పారామంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన... సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తొలి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నగర పరిధిలో చాలా మంది జర్నలిస్టులు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విలేకరులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కాటూరి చారిటబుల్ ట్రస్ట్... ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఇదీ చదవండి: