ETV Bharat / state

పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన - Purandeshwari

Bjp Protest On Vijaya SaiReddy Comments On Purandareswari బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి.. విజయసాయిరెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

bjp_protest_on_vijaya_saireddy_comments
bjp_protest_on_vijaya_saireddy_comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 7:37 PM IST

BJP Protest On Vijaya Sai Reddy Comments On Purandareswari : విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపారు. పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం విక్రయాలపై సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.

విశాఖలో.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ నరసింహారావు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పురందేశ్వరి విజయ సాయి రెడ్డిపై పత్రికాముఖంగా కొన్ని ఆరోపణలు చేశారని, వీలైతే వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. అలా కాకుండా మహిళలను కించపరిచే భాషతో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు.

Purandeshwari Fire on Sand Exploitation: ఇసుక దోపిడీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రతి నెలా రూ.200 కోట్లు: పురందేశ్వరి

రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి.. పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై సీబీఐ విచారణ కోరాలని మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి ఎవరికీ ఎంత సొమ్ము ముట్టిందో వెల్లడించాలని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు విజయ సాయి రెడ్డి చిత్రపటాన్ని దహనం చేయాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

AP BJP President Daggubati Purandeswari Press Meet: 'ఇసుక, మద్యం పాలసీతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీ.. సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నం'

మన్యం జిల్లా కేంద్రంలో.. లిక్కర్ డాన్ విజయ్ సాయి రెడ్డి డౌన్ డౌన్ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లిక్కర్ డాన్ విజయ్ సాయి రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని నాయకులు ఆరోపించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారని తెలిపారు. రాష్ట్రంలో అడ్డదిడ్డంగా మద్యం విక్రయాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని పేర్కొన్నారు. వైసీపీ మద్యం దందాపై దందాపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె ప్రకటన చేస్తే విజయ సాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని నాయకులు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడడంపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.

Purandeshwari Fire on YSRCP Govt: రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు: పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.