విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక, ఉద్యోగ సంఘాల భయాందోళనలను తొలగించాలని.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. వైకాపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇసుక, మద్యాన్ని ప్రైవేటీకరించిన మాట మరిచిపోయి.. స్టీల్‌ప్లాంట్‌పై కపట నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు దీనిపై సమాధానం చెప్పాలని కోరడం అర్ధరహితమన్నారు.
ఆ సమాచారం ఏ మాత్రం సరిపోదు
వీఎంఆర్డీఏ ప్రకటించిన మాస్టర్ ప్లాన్ పరిశీలనకు.. ఇచ్చిన సమయం, పరిశీలన చేయడానికి ఇచ్చిన సమాచారం ఏమాత్రం సరిపోదని భాజపా స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏదో గీతలను ఇచ్చేసి.. వాటిని ఏ రకంగానూ ప్రజలకు అర్ధం కాకుండా చేయడంలో మాస్టర్ ప్లాన్‌ని రూపొందించినట్టుగా ఉందని విమర్శించింది. విశాఖలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమావేశం నిర్వహించారు. 75 లక్షల మందికిపైగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ మాస్టర్ ప్లాన్‌పై.. ఎవరికి స్పష్టత లేకుండా మమ అనిపించేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్నారు. దీనిపై తగిన సమయం ఇచ్చి, అందరికీ అర్ధమయ్యే రీతిలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం