అచ్చెన్నాయుడి పట్ల పోలీసుల తీరు సరికాదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఇల్లు కట్టుకునేందుకు సామాన్యుడికి ఇసుక దొరకడం లేదన్నారు. ఏపీలో భవన నిర్మాణ రంగం కుదేలైందని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకం కింద ఇల్లు కట్టిన గుత్తేదారులకు ఏడాదిగా బిల్లులు ఇవ్వట్లేదని విష్ణుకుమార్రాజు ఆరోపించారు. ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్కు కరోనా