విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వలసల ప్రవాహం కొనసాగుతోంది. భాజపా సీనియర్ నాయకుడు మళ్ల వెంకటరావు... మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భాజపాలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించి ఉత్తమ నాయకునిగా గుర్తింపు పొందారు వెంకటరావు. ఆయన రాకతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోందని మంత్రి గంటా స్పష్టం చేశారు. మళ్ల వెంకటరావుతోపాటు, ఆయన కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా గంటా సింగపూర్ ఫోరం టీ- షర్టులను ఆవిష్కరించారు.
ఇవి చూడండి...