విశాఖ జిల్లా గాజువాక షీలానగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని భాజపా నాయకులు ధర్నా చేశారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 5 లక్షల మంది కార్మికులున్నారని.. వారు అనారోగ్యం పాలయితే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. పైగా రవాణా సదుపాయం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
షీలా నగర్లో ఆసుపత్రి నిర్మిస్తే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణుకమార్ రాజు విమర్శించారు. వెంటనే హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: