విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే, అభం శుభం తెలియని పసిమొగ్గలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానిక మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 3,4వ తరగతి చదువుతున్న విద్యార్థినిలపై ఇద్దరు ఉపాధ్యాయులు ఈ పనికి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన నిందితులను అదుపులోకి తీసుకుని 14 రోజులు రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో ఒకరు సాక్షాత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఉండటం, తల్లిదండ్రుల్ని నిర్ఘాంతపోయేలా చేసింది. నిందితులపై లైంగిక ఆరోపణలతో పాటు ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీచూడండి.'నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి ' కేసు దోషికి జీవిత ఖైదు