ETV Bharat / state

హోటల్‌ గదిలో బెల్జియం వాసి మృతి - crime news in vishaka

విశాఖ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ప్రైవేట్ హోటల్ లో ఒక విదేశీయుడు మృతి చెందాడు. మృతుడు బెల్జియం దేశస్తుడుగా గుర్తించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేస్ నమోదు చేసి హోటల్ సిబ్బందిని విచారిస్తున్నారు.

మృతి చెందిన వెరిముల్‌ గ్రీట్‌
మృతి చెందిన వెరిముల్‌ గ్రీట్‌
author img

By

Published : Apr 26, 2021, 4:34 AM IST

విశాఖ ఆర్‌అండ్‌బీ మారియట్‌ హోటల్‌లో ఓ విదేశీ వ్యక్తి మృతి చెందారు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్జియంకు చెందిన వెరిముల్‌ గ్రీట్‌ (58) ఈ ఏడాది ఫిబ్రవరిలో రసెల్‌ డెకార్స్‌ కంపెనీకి మిషన్‌ కన్సల్టెంట్‌గా వచ్చారు. హోటల్‌ నాలుగో అంతస్తు 438 గదిలోనే అప్పటి నుంచి ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక గదిలో నిద్రించారు. బెల్జియం నుంచి గ్రీట్‌ భార్య సాయంత్రం పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా హోటల్‌కు సమాచారమిచ్చారు. సిబ్బంది వెళ్లి చూడగా మంచంపై విగత జీవిగా పడి ఉన్నారు. 108 సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈయనకు కొంతకాలంగా ఆరోగ్యం బాగులేదని,గుండెపోటు వచ్చి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హోటల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు స్టేషన్‌ సీఐ ఉమాకాంత్‌ తెలిపారు.

ఇవీ చదవండి

నల్లబజారులో రెమ్‌డెసివిర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.