విశాఖలో మూడు రోజులపాటు సాగిన కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన తుది పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు ఆర్కే బీచ్‌కి తరలివచ్చారు. తుదిపోరులో పురుషుల, మహిళల విభాగాల్లో కజకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఇరాన్ రన్నరప్‌గా నిలవగా.. మహిళల విభాగంలో శ్రీలంక జట్టు రెండోస్థానం పొందింది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇవీ చదవండి: