ETV Bharat / state

Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: దసపల్లా భూముల కోసం వైవీ వర్సెస్ విజయసాయిల మధ్య అంతర్యుద్ధం - Ysrcp news

Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: విశాఖలోని దసపల్లా భూములపై వైఎస్సార్సీపీ ముఖ్య నేతల మధ్య పోరు నడుస్తోంది. రాణి కమలాదేవి వారసుల నుంచి కొనుగోలు చేశామని చెబుతున్న వర్గానికి.. విజయసాయిరెడ్డి అండగా నిలువగా.. రాణి సాహిబా ఆఫ్‌ వాద్వాన్‌ వారసుల పేరుతో బోర్డులు పెట్టిన వారికి వైవీ సుబ్బారెడ్డి అండగా నిలిచారు. ఈ వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్‌కి చేరడంతో హాట్ టాపిక్‌గా మారింది.

Battle_Between_YV_vs_Vijayasai_for_Dasapalla_Lands

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 10:48 AM IST

Updated : Sep 24, 2023, 12:18 PM IST

సపల్లా భూముల కోసం వైవీ, విజయసాయిల మధ్య అంతర్యుద్ధం..తాడేపల్లికి పంచాయతీ

Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అంతర్యుద్ధాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నంలో నిషేధిత జాబితా నుంచి బయటపడిన దసపల్లా భూముల కోసం అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య నడుస్తోన్న పోరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం తాడేపల్లికి చేరడంతో.. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తను ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించడంతో చర్చనీయాంశంగా మారింది.

Visakha Dasapalla Land Issue: నిషేధిత జాబితా 22ఏ నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ మధ్యనున్న ఈ భూముల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని.. ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే.. ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్‌ వాద్వాన్‌ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవీ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయితీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది.

Dasapalla land scam: కట్టబెట్టాలన్న కంగారే తప్ప.. కాపాడాలనే తపనేదీ?

Mutual Complaints for Dasapalla Lands: ఈ క్రమంలో ఎన్నో వివాదాల మధ్య దసపల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు రూ.2వేల కోట్లుటుందని అంచనా. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకూ హక్కు ఉందంటూ.. ఓ వ్యక్తి కోర్టు ఆశ్రయించారు. అయితే..ఆ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ.. రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని.. ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా, ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని.. దసపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

YSRCP: విశాఖలో ఎంపీ భూమాయ.. కారుచౌకగా భూములు స్వాహా

Pressure on CP Trivikrama Verma Over Forgery: ఫోర్జరీ విషయంలో విజయసాయిరెడ్డి అనుచరుడిని అరెస్టు చేయాలని వైవీ అప్పటి సీపీ త్రివిక్రమ వర్మపై ఒత్తిడి తెచ్చారు. అరెస్టు చేయకుండా ఎంపీ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే వ్యవహారమంతా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. ఈ పంచాయతీకి ముందే పెదజాలారిపేట భూముల టీడీఆర్‌ విషయంలో వైవీ కలుగజేసుకోగా.. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్‌ హెచ్చరించింది. ఈ సమయంలోనే దసపల్లా గొడవ అక్కడికి చేరడంతో.. ఈ సారి వైవీ ఘాటుగానే సమాధానం చెప్పారని సమాచారం. 'ఫోర్జరీ సంతకం అని అధికారులు తేల్చారు కాబట్టే అరెస్టుకు ఆదేశించా. ఇందులోనూ తగ్గి ఉండాలంటే ఇన్‌ఛార్జి పదవే నాకు అవసరం లేదు' అని చెప్పి పంచాయితీ నుంచి వైవీ లేచి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంతోనే సీపీపై బదిలీ వేటు పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Officials Survey on Dasapalla Lands: దసపల్లా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి.. సబ్‌ డివిజన్‌ చేసిన అధికారులు.. రాణి సాహిబా వాద్వాన్‌ వారసులు ఎవరనేది ఆ సమయంలో డిక్లేర్‌ చేయలేదు. సర్వే పూర్తి చేశాక బతికి ఉన్న వారసుల పేర్లు రికార్డుల్లో ఎక్కించాల్సి ఉండగా.. అలా చేయకుండానే క్లియరెన్స్‌ ఇచ్చేశారు. దీంతో 1921 నుంచి తాజాగా అప్‌డేట్‌ చేసిన రెవెన్యూ రికార్డుల్లో దసపల్లా హిల్‌ సర్వే నంబరు 1197, 1196, 1028లలో భూములు రాణి సాహిబా వాద్వాన్‌ పేరుతో కనిపిస్తున్నాయి. ఇటీవల పెదజాలారిపేట భూముల్లో సైతం రాణి సాహిబా వాద్వాన్‌ వారసుల పేరుతో అర్జీ పెట్టారన్న కారణంగా అధికారులు ఆగమేఘాలపై సర్వే చేశారు. అసలు రాణి వారసులెవరనేది తేలకుండా టీడీఆర్‌లు ఇచ్చేందుకు పావులు కదిలాయి. పెదజాలారిపేట భూములకు టీడీఆర్‌లు దక్కించుకుంటే.. ఆ తర్వాత అదే రాణి పేరుతో ఉన్న దసపల్లా భూములకు సైతం టీడీఆర్‌లు దక్కించుకునే ఎత్తుగడలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

విశాఖ నడిబొడ్డున కారుచౌకగా భూమి బేరం.. విస్తుగొలిపే డెవలప్‌మెంట్‌ ఒప్పందం

Last Updated : Sep 24, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.