విశాఖలో విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి యత్నించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా.. ఉత్తరాంధ్ర నాయకులు నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రలో ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఇదీ చదవండి: APPSC: త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్...