ETV Bharat / state

బొమ్మగీసి కరోనాపై ప్రజలకు అవగాహన

కరోనా మహమ్మారి ఎలా వస్తోంది.. దాని నివారణ చర్యలు ఏంటి లాంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. విశాఖ మన్యం అరకులోయలోని ప్రజలకు కరోనా బొమ్మగీసి అవగాహన కల్పించారు.

Awareness of the people on corona by drawing at araku in visakha agency

author img

By

Published : Apr 16, 2020, 2:57 PM IST

విశాఖ జిల్లా అరకులోయలో కరోనా వైరస్​పై ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అరకులోయ సీఐ పైడయ్య, ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై కరోనా వైరస్ చిత్రాన్ని వేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ ఈ చిత్రాన్ని గీశారు. కరోనా వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన హెల్ప్​లైన్ నెంబర్​ని చిత్రంలో పొందుపరిచారు. ప్రజలంతా లాక్​డౌన్​ని పాటించి పోలీసులకు సహకరించాలని ఈ చిత్రం ద్వారా కోరుతున్నారు.

బొమ్మగీసి కరోనాపై ప్రజలకు అవగాహన

ఇదీ చదవండి: 'స్వీయ నిర్బంధం, భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను అరికట్టవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.