తుపాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలను సందర్శించారు. తుపాను కారణంగా భీమిలి మండలంలోని మంగమారిపేట తీరంలో సముద్రపు అలలు ముందుకు వచ్చాయన్న సమాచారం తెలుసుకున్న మంత్రి... గ్రామానికి వెళ్లి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు. తుపాను తీరం దాటిన సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలలు, బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
మత్స్యకార గ్రామాలను సందర్శించిన మంత్రి అవంతి - మత్స్యకార గ్రామాలను సందర్శించిన మంత్రి అవంతి
పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ జిల్లా సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలను సందర్శించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.