ETV Bharat / state

నాడు గంటా...నేడు అవంతి..మంత్రిగా భీమిలి ఎమ్మెల్యే

మంత్రిగా చేయాలన్నది ఆయన కల... అందుకే భీమిలి నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టారు. చివరకు తన ఆప్తమిత్రుడు గంటా శ్రీనివాసరావుతో విభేదాలొచ్చినా వెరవలేదు. చివరి నిమిషంలో వైకాపాలోకెళ్లారు. భీమిలి సీటు తెచ్చుకున్నారు. ఘన విజయం సాధించి....మంత్రిగా ప్రమాణం చేశారు.

author img

By

Published : Jun 8, 2019, 2:59 PM IST

నాడు గంటా...నేడు అవంతి..మంత్రిగా భీమిలి ఎమ్మెల్యే

సచివాలయ వేదికగా రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార వేడుక జరిగింది. విశాఖ జిల్లా నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు వైకాపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

మంత్రిగా ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాస్
ప్రరాపాతో ప్రస్థానం...ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు...2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.సామాన్య జనంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారన్న పేరు తెచ్చుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులందరితోనూ స్నేహంగా ఉండేవారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా, వివాదాల్లో చిక్కుకోకుండా నెగ్గుకురాగలిగారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనపుడు ఈయన కూడా హస్తం పార్టీలో చేరారు. ఆ తరువాత తన సన్నిహిత మిత్రుడు గంటా శ్రీనివాసరావుతో కలిసి తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెదేపా ను చివరి నిమిషంలో వీడిన ఆయన..వైకాపాలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ముత్తంశెట్టితో కలిపి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు మంత్రులుగా చేసినట్లయింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.