ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని రూడకోటలో బీఎస్ఎఫ్ పోలీస్ అవుట్ పోస్టులో... శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న ఏఎస్ఐ వీరేంద్ర కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. తోటి పోలీసులు వెంటనే సమీప రూడకోట ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడినుంచి ముంచింగిపుట్టు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మారుమూల కొండల్లో అవుట్ పోస్టు ఉండడం, రాత్రిపూట చలిలో విధులు నిర్వహించడంతో గుండెపోటు వచ్చి ఉంటుందని తోటి సిబ్బంది తెలిపారు. మృతుడు మధ్యప్రదేశ్ వాసిగా సిబ్బంది తెలిపారు. సకాలంలో వైద్యం అందక వీరేంద్ర కుమార్ మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: