విశాఖలో..
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖలో ఆశావర్కర్లు నిరసన చేపట్టారు. కంచరపాలెం, రామూర్తి పంతులు పేట, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని.. అలాగే కొవిడ్ కారణంగా చనిపోయిన ఆశా వర్కర్లకు బీమా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించామని తెలిపారు.
ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి, వారి సేవలకు అవసరమైన రక్షణ పరికరాలు సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి డిమాండ్ చేశారు. విశాఖ అల్లిపురం నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అశా వర్కర్లకు ఏన్ 95 మాస్కులు, శానిటైజర్లు గ్లౌజులు సమాకూర్చాలని డిమాండ్ చేశారు.
పాలకొండ ఏరియా ఆసుపత్రి ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణరావు, మండల కో-కన్వీనర్ బి.అమరవేని, తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అనంతపురంలో...
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. కరోనా కష్టకాలం సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తుంటే తమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపించారు. కనీసం తమకు రక్షణ పరికరాలు ఇవ్వకుండా తమతో పని చేయిస్తున్నారని.. వేతనాలు రెండు విడతలుగా ప్రభుత్వం అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: