ఈ నెల 14న విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శన చందనోత్సవం కోసం... చందనం అరగదీత కార్యక్రమం పూర్తయింది. నేడు చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి ఆ మిశ్రమాన్ని శ్రీవారి భాండాగారంలో భద్రపరిచారు. 14వ తేదీన నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: