విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వగ్రామమైన శరభన్నపాలెంలో వైభవంగా జరిగింది. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన శివప్రసాద్‌ను పరిణయమాడింది. అతను సెయింట్ థెరిసా విద్యాసంస్థల కరస్పాండెంట్, శివ ఇన్స్టిట్యూట్ డెరక్టరుగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన మాధవి పరిణయం మాత్రం బంధువుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈనెల 22న విశాఖలో బంధు, మిత్రుల కోసం విందు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..