విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎలమంచిలి, నర్సీపట్నం ప్రాంతాల్లో రైల్వే పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి తెలిపారు. మాడుగులకు చెందిన శ్రీనాథు శ్రీనివాసరావు(దేవరాపల్లి శ్రీను)ను వాల్తేరు డివిజన్ డీఆర్యూసీసీ మెంబర్గా, చోడవరానికి చెందిన బొడ్డు శ్రీరామ్ మూర్తిని విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్యుసీసీ మెంబర్గా నియామక పత్రాన్ని ఎంపీ అందజేశారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.
ఇదీ చదవండి