ETV Bharat / state

మూడు నెలల తరవాత అప్పన్న దర్శనం..! - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

విశాఖ జిల్లా సింహాచలంలోని అప్పన్న దర్శనం భక్తులకు లభించింది. లాక్​డౌన్​ కారణంగా దాదాపు మూడు నెలలుగా దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు... నేడు స్వామి వారిని దర్శించుకోగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

appanna temple reopen at visakha
మూడు నెలల తరవాత అప్పన్న దర్శనం
author img

By

Published : Jun 10, 2020, 12:23 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవరాహలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయంలో నేడు భక్తులకు దర్శనం కలిగింది. లాక్​డౌన్​ కారణంగా దాదాపు మూడు నెలలుగా స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు నేటికి దర్శన భాగ్యం లభించింది. భక్తుల దర్శనార్థం స్వామివారి ఆలయాన్ని అందంగా అలంకరించారు ఆలయ అధికారులు.

భక్తులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. స్వామివారి దర్శనాన్ని 4 స్లాట్లుగా నిర్ణయించామని, దర్శనం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకే ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆన్​లైన్​లో టికెట్ బుక్ చేసుకుని రావాలని తెలిపారు. టికెట్​ బుక్​ చేసుకోలేని వారు శ్రీదేవీ కాంప్లెక్స్​లో టికెట్​ తీసుకుని దర్శనానికి రావలసిందిగా సూచించారు.

ఆలయంలో తీర్థప్రసాదాలు ఇవ్వరని తెలిపారు. భక్తుల కోసం కొండపైన శానిటైజర్​ను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. దాదాపు మూడు నెలలుగా దర్శనం లేక ఉన్న భక్తులు స్వామిని దర్శించుకోవడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూ డండి:శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.