విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ కేంద్రాన్ని 100 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పలువురు అధికారులు ఈ కేంద్రాన్ని పరిశీలించారు.
మరో రెండు రోజుల్లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యంతో పాటు.. భోజనం అందిస్తామని అన్నారు. ఈ కేంద్రంలో 10 మంది వైద్యులతో పాటు 20 మంది ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ కనకారావు హాజరయ్యారు.
ఇదీ చదవండి:
డబుల్ మ్యూటెంట్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది: సీసీఎంబీ మాజీ డైరెక్టర్