ETV Bharat / state

కరోనా ఉద్ధృతితో.. ఉపాధి హామీ పనులకు బ్రేక్

కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ప్రభావం ఉపాధి హామీ పనులపైనా పడుతోంది. ఉద్ధృతి తగ్గేవరకు తాము పనుల్లోకి రాలేమని కూలీలు అధికారులకు తేల్చి చెప్పేశారు.

corona problems
corona problems
author img

By

Published : May 5, 2021, 9:45 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లోని పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో.. ఆ ప్రభావం ఉపాధి హామీ పనులపై పడుతోంది. పనులకు వచ్చేందుకు కూలీలు వెనుకంజ వేస్తున్నారు. నర్సీపట్నం మండలంలోని కేఎల్ పురం, ఓఎల్ పురం, చెట్టుపల్లి , ధర్మసాగరం , వేములపూడి, అమలాపురం మిట్టపాలెం , పంచాయతీల్లో ఉపాధి పనులు నిలిచిపోయాయి.

మండలంలోని 12 పంచాయతీల్లో 7520 జాబ్​కార్డులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 5,600 మంది పనులకు వచ్చేవారు. అయితే ఈనెల 4వ తేదీ నుంచి ఐదు పంచాయతీల్లో 2729 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారని ఉపాధిహామీ అధికారులు వెల్లడించారు. కరోనా సోకకుండా నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించేలా చూస్తున్నప్పటికీ.. కూలీలు హాజరుకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

కరోనా వ్యాధి అధికంగా ఉన్న గ్రామాల్లో ఉపాధి పనులను నిలిపివేయాలని పలువురు సర్పంచులు.. అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. దీనిలో భాగంగానే విశాఖ జిల్లాలోని రోలుగుంట మండలం కొవ్వూరు , కె నాయుడు పాలెం, ముత్యంపేట , రోలుగుంట తదితర గ్రామాల సర్పంచులకు.. వైరస్ ఉధృతి తగ్గేవరకు తాము పనుల్లోకి రాలేమని కూలీలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వినతి పత్రాలను అధికారులకు అందజేశారు.

ఇదీ చదవండి: కరోనా మృతుల అంత్యక్రియలకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.