విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ సృజన వెల్లడించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో వినియోగించుకునేట్టుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని తరలించామని తెలిపారు.
ఇవీ చదవండి