- లోకేశ్ పాదయాత్రకు "యువగళం" పేరు ఫిక్స్.. ప్రోమో అదుర్స్
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 27న కుప్పం నుంచి ఆయన మహా పాదయాత్రగా జనక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. లోకేశ్ మహా పాదయాత్రకు "యువగళం" పేరును పార్టీ ఖరారు చేసింది. NTR భవన్లో.. యువగళం జెండాను పలువురు నాయకులు ఆవిష్కరించారు.
- మాకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి: నెల్లూరు మిల్లర్స్ అసోసియేషన్
కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేకున్నామని నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
- గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆగని మరణాలు.. రెండు నెలల్లో ఐదుగురు మృతి
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రెండు నెలల వ్యవధిలో అస్వస్థతకు గురై ఐదుగురు మృతి చెందారు. అధికారులు పరిష్కారం చూపకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ధోని అనే విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
- టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎస్సీ సెల్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయ ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం SC సెల్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా.. జాతీయ రహదారిపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
- యూరోప్ పర్వత శిఖరాల్లో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా..
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై అభిమానం..తెలుగు రాష్ట్రాలు దాటి యావత్ యూరప్ ఖండం వరకు చాటుకుంది.. పార్టీ పట్ల అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా.. మైనస్ 10డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా లెక్క చేయకుండా.. సుమారు 3000మీటర్లు ఎత్తులో పర్వత శిఖరంపై పార్టీ జెండాను ఎగురవేశాడు.
- చర్చిపై దాడి.. విగ్రహం ధ్వంసం.. హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక మైసూరులోని సెయింట్ మేరీస్ చర్చిపై దాడి చేశారు. బేబీ జీసస్ విగ్రహంతో పాటు చర్చిలోని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
- 8ఏళ్లకే పెళ్లి.. బాడీబిల్డింగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్
8ఏళ్లకే పెళ్లైనా సరే.. ఓ మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని బాడీ బిల్డింగ్ రంగంలో రాణిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన ఆ మహిళ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన 39వ అంతర్జాతీయ మహిళా బాడీ బిల్డింగ్ పోటీల్లో భారత్‌కు బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. టైటిల్ గెలుచుకొని భారత్‌కు చేరుకున్న ఆమె.. సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడింది.
- ఇక శిఖర్ ధావన్ పరిస్థితి ఏంటి.. కెరీర్ ముగిసినట్టేనా?
టీ20లకు ఎప్పుడో దూరమైనప్పటికీ.. వన్డేల్లో మాత్రం మళ్లీ జట్టులో చోటు దక్కించుకుని, కొన్ని సిరీస్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు నిరాశ ఎదురైంది. లంకతో వన్డేలకు జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు..
- పాపం శ్రుతి హాసన్ అలా చేసినందుకు ఎంత ఫీలైందో
ప్రస్తుతం వరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా ఇండస్ట్రీలో తనకెదురైన అనుభవాల్ని గుర్తుచేసుకుంది. అప్పట్లో తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. ఇంకా చాలా విషయాలే చెప్పింది. ఆ సంగతులు.
- హీరో సిద్ధార్థ్ తీవ్ర ఆవేదన.. ఆ అధికారులు వేధించారంటూ..
బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓయ్, బొమ్మరిల్లు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేమకథా చిత్రలతో మెప్పించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాల గురించి నెటిజన్లతో పంచుకుంటుంటాడు.